ఏసీపీ వివేక్‌ భగవత్‌పై ఆరోపణలు, తీవ్రంగా మండిపడిన మహువా | Mahua Moitra scathing attack on Delhi Police ACP Vivek Bhagat | Sakshi
Sakshi News home page

ఏసీపీ వివేక్‌ భగవత్‌పై ఆరోపణలు, తీవ్రంగా మండిపడిన మహువా

Oct 5 2026 5:38 PM | Updated on Oct 5 2026 6:09 PM

Mahua Moitra scathing attack on Delhi Police ACP Vivek Bhagat

సీజేపీ నిరసనల సందర్బంగా ఏసీపీ వివేక్ భగత్ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనపై  టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చాలా తీవ్రంగా స్పందించారు. పోలీసు యూనిఫాంవేసుకొని ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ ఇలా ప్రవర్తించడానికి సిగ్గుపడాలి అంటూ మండిపడ్డారు. యూనిఫాం తీసేసి, కాషాయ దుస్తులు వేసుకోవాలంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ తనపై దాడి చేశారని ఒక స్వతంత్ర మహిళా జర్నలిస్ట్ ఆరోపించిన నేపథ్యంలో, మహువా ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుటుంబం సిగ్గుపడాలని  పేర్కొంటూ, ఆ యూనిఫాం తీసివేసి కాషాయ రంగు చడ్డీలు వేసుకోండి అంటూ  తీవ్రమైన పదజాలంతో మహువా ట్వీట్‌ చేశారు.

 మహిళా జర్నలిస్టుపై  ఏసీపీ వివేక్ భగత్  వేధింపులపై కాక్రోచ్‌ జనతాపార్టీ కూడా స్పందించింది. ఏసీపీపై  కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది.  ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవకతవకల ఆరోపణల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు సీజేపీ ఆందోళనను కవర్‌ చేస్తున్న సమయంలో ఏసీపీ వివేక్ భగత్ తనను లైంగికంగా వేధించారని, శారీరకంగా తాకారని ఆరోపించిన  మహిళా జర్నలిస్టును, మరో 16 మంది జర్నలిస్టులతో పాటు సోమవారం మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. వారిని సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.  ఏసీపీపై కేస నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్వతంత్ర జర్నలిస్టులు, కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల వరుసగా రెండో రాత్రి కూడా నిరసన తెలుపుతున్న తరుణంలో ఈ అరెస్టు జరిగింది.నిరసన తెలుపుతున్న తరుణంలో ఈ అరెస్టు జరిగింది.

ఇదీ చదవండి: ఫ్లాట్‌ఫాం టికెట్, రూ. 500 ఫైన్‌‌ : ఈ విషయం తెలుసా మీకు?

కాగా స్వతంత్ర జర్నలిస్ట్, కంటెంట్ క్రియేటర్ అయిన రోసీ, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న సమయంలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ తనను లైంగికంగా వేధించారని  సోషల్ మీడియాలో వేదికగా ఆరోపించారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాను అదుపులోకి తీసుకోవడాన్ని తాను చిత్రీకరిస్తుండగా, ఏసీపీ వివేక్ భగత్ తన వెనుక నుండి వచ్చి, తన ఛాతీని తాకి, బలంగా తోసేశారని ఆరోపించారు.  ఆమెకు సీజేపీ కోకన్వీనర్ సౌరవ్ దాస్, న్యాయ విభాగ అధిపతి రత్న సింగ్ నేతృత్వంలో సీజేపీ కార్యకర్తలు, పలువురు స్వతంత్ర మీడియా సిబ్బందితో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్ వెలుపల రాత్రంతా భారీ ధర్నా నిర్వహించారు. అంతేకాదు మహిళా జర్నలిస్టుల నుండి మూడు వేర్వేరు వేధింపుల ఫిర్యాదులు అందినట్లు అంగీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ కోసం ఈ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

ఇదీ చదవండి: బాల్కనీ నుంచి పడిపోతున్న చిన్నారిని ఎలా పట్టుకున్నాడో చూడండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement