బాల్కనీ నుంచి పడిపోతున్న చిన్నారిని ఎలా పట్టుకున్నాడో చూడండి! | Heart Stopping Moment As Egyptian Man Makes Split Second Catch To Save Boy Falling From Balcony | Sakshi
Sakshi News home page

బాల్కనీ నుంచి పడిపోతున్న చిన్నారిని ఎలా పట్టుకున్నాడో చూడండి!

Oct 5 2026 2:50 PM | Updated on Oct 5 2026 3:06 PM

Heart Stopping Moment As Egyptian Man Makes Split Second Catch To Save Boy Falling From Balcony

ఈజిప్టులోని గిజాలో రెండవ అంతస్తు బాల్కనీ నుండి కింద పడిపోయిన ఐదేళ్ల బాలుడిని చూసి, రెప్పపాటులో స్పందించి బాలుడ్ని  అతిపెద్ద ప్రమాదం నుంచి రక్షించిన ఘటన వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.   అత్యంత చురుగ్గా కదిలి బాలుడిని కాపాడిన యువకుడిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. 

 గల్ఫ్ న్యూస్ ప్రకారం ఈజిప్ట్‌లోని గీజా (Giza) ప్రాంతంలో  ఈఘటన చోటు  చేసుకుంది.గీజాలోని అర్ద్ ఎల్-లెవా (Ard El-Lewa) ప్రాంతంలో ఒక దుకాణం దగ్గర ఉన్న అహ్మద్ రగాబ్.. అకస్మాత్తుగా కేకలు, ఏడుపులు విని పైకి చూశాడు. ఆ సమయంలో ఒక బాలుడు పైనుంచి కిందకు పడిపోవడం గమనించాడు. అంతేక  ఒక్క క్షనం కూడా ఆలోచించకుండా మెరుపువేగంతో కదిలి బాలుడు కింద పడుతున్న చోటుకు పరిగెత్తుకెళ్లి అతడిని అందుకున్నాడు. అయితే . బాలుడు కిందకు పడేటప్పుడు మధ్యలో ఒక వాషింగ్ లైన్ (బట్టలు ఆరేసే తాడు) తగలడం వల్ల రగాబ్‌కు ఆ బాలుడిని అందుకోవడానికి కొద్దిగా సమయం దొరికింది.ఎలాగైతేనేం మొత్తానికి ప్రాణాపాయం తప్పింది: రగాబ్ తన చేతులతో ఆ బాలుడిని ఒడిసిపట్టుకుని, నేరుగా నేలపై పడకుండా కాపాడాడు. ఆ తర్వాత చుట్టుపక్కల గుమిగూడి రగాబ్‌ను అభినందించారు.

బాలుడి ప్రాణాలను కాపాడాలనే ఆలోచనతోనే వెంటనే స్పందించానని రగాబ్ తెలిపారు. అంతా క్షణాల్లో జరిగియిందన్నాడు. బాలుడు సురక్షితంగా బయటపడిన తర్వాతే ఆ పరిస్థితి ఎంత ప్రమాదకరమైనదో తనకు అర్థమైందని, మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే తాను అలా చేయగలనో లేదో చెప్పలేనని  కూడా చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియా ప్రశంసలు
ఈ వీడియో ఈజిప్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రగాబ్ సమయస్ఫూర్తిని, వేగవంతమైన స్పందనను ఎంతో ప్రశంసించారు. అయితే ఈ ప్రశంసలను రగాబ్ తేలిగ్గా తీసుకుంటూ.. బాలుడు నేలపై పడకుండా ఆపడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, బాల్కనీలు  కిటికీల దగ్గర పిల్లలు ఎక్కడానికి వీలుగా కుర్చీలు లేదా ఇతర వస్తువులను ఉంచవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement