ఘనంగా వారధి ఫౌండేషన్‌ వేడుకలు | Vaaradhi India Foundation Annual Lecture and Prize Distribution Ceremony | Sakshi
Sakshi News home page

ఘనంగా వారధి ఫౌండేషన్‌ వేడుకలు

Oct 5 2026 6:03 PM | Updated on Oct 5 2026 6:03 PM

Vaaradhi India Foundation Annual Lecture and Prize Distribution Ceremony

వారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షిక ఉపన్యాసం, బహుమతుల ప్రదానోత్సవాన్ని ఈ నెల అక్టోబర్ 3న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ, చురుకైన భాగస్వామ్యం, విజయాలను గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో వారధి ఇండియా ఫౌండేషన్ ఈ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి డా. మోహన్ కందా (IAS, రిటైర్డ్) 2013లో ‘వారధి’ని స్థాపించారు. ‘వారధి’ అంటే ‘వంతెన’. వ్యక్తులు, సంస్థలు, సమాజాల మధ్య అనుసంధానాన్ని ఏర్పరచి, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలకు వేదికగా వారధి పనిచేస్తోంది.

విద్య ద్వారా సాధికారత అనే స్ఫూర్తితో యువత వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజం, దేశానికిసానుకూల మార్పు తీసుకురాగలిగేలా తీర్చిదిద్దడం వారధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్ తరాల మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని గుర్తించిన ఫౌండేషన్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం కాకుండా, అదే వ్యవస్థతో కలిసి పనిచేసి మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది.

ప్రభుత్వ విద్యా వ్యవస్థలు, సంస్థలు, ఉపాధ్యాయులకు అవసరమైన మద్దతు అందించడం ద్వారా వారు మరింత సమర్థవంతంగా పనిచేసి, ఎక్కువ మంది విద్యార్థుల జీవితాల్లో సుస్థిరమైన మార్పు తీసుకురావడానికి వారధి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఆనందకరమైన అభ్యాస పద్ధతుల్లో స్పోకెన్ ఇంగ్లీష్, కోడింగ్ తరగతులను నిర్వహిస్తోంది.

‘లెట్స్ టీచ్ ఇన్ ఇంగ్లీష్’ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదిలో మరింత ఆత్మవిశ్వాసంతో బోధించేందుకు, సమర్థవంతమైన బోధనా పద్ధతులను అభివృద్ధి చేసుకునేందుకు వారధి తోడ్పడుతోంది. ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT, తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్ష భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి. 

విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, విశ్లేషణాత్మక ఆలోచన, తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచే సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు, విభిన్న దృక్పథాలను అర్థం చేసుకుని నిర్మాణాత్మకంగా చర్చించేలా ప్రోత్సహించేందుకు వారధి 2013 నుంచి వార్షిక పోటీలను నిర్వహిస్తోంది.

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 52 జిల్లాల నుంచి 305 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి వ్యాసరచన, చర్చా పోటీల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 25 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో 27 జిల్లాల నుంచి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించారు.

ఇదీ చదవండి: ఒత్తిడి తెచ్చిన ముప్పుకి స్టార్టప్‌కి అమ్మేశాడు! కట్‌చేస్తే ఏకంగా రూ. 8వేల కోట్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement