ముగ్గురు స్నేహితులు సివిల్స్‌కి సన్నద్ధమవ్వడమో, ప్రైవేట్ ఉద్యోగం చేయడమో ఎంచుకోకుండా..వ్యాపారానికి సై అన్నారు. ఆ ముగ్గురు ఎంచుకుంది చాయ్ వ్యాపారాన్ని. అందరికి తెలిసిన సాధారణ వ్యాపారాన్ని ఎంత క్రేజీ వ్యాపారంగా మార్చారంటే..జస్ట్ పేరుతోనే వైబ్స్ తెప్పించి క్రేజ్ వచ్చేలా చేశారు. దాంతో అది ప్రస్తుతం పెద్ద వ్యాపార సామ్రాజ్యంలా విస్తరించి ఎన్ని కోట్లు ఆర్జిస్తుందో తెలిస్తే విస్తుపోవడం ఖాయం.
వాళ్లే ఇండోర్‌కి చెందిన స్నేహితులు అనుభవ్ దుబే, ఆనంద్ నాయక్, రాహుల్ పాటిదార్‌లు. భారత్‌లో టీకి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. ఆ నేపథ్యంలోనే భీ ముగ్గురు టీకొట్టుతోనే వ్యాపారం చేయడం ప్రారంభించారు. అందరిలా చిన్న కొట్టు పెట్టేసుకుంటే ఏం క్రేజ్ ఉంటుంది. అందుకని చాలా వినూత్నంగా ఆలోచించి 2016లో చాయ్ సుట్టా బార్‌ని స్థాపించారు. జస్ట్ రూ. 3 లక్షలతో ప్రారంభించారు. అయితే ఆ చాయ్‌ని సరసమైన ధరల్లో అందించారు.
దీంతోపాటు బర్గర్లు, నూడుల్స్, పాస్త వంటి ఆహారాలను కూడా సర్వ్ చేశారు. ఆ చౌక ధరల కారణంగానే అనతికాలంలోఏ అతి పెద్ద వ్యాపార బ్రాండ్ అవతరించి బ్రాంచ్‌లుగా విస్తరించింది. అలా ఈ బ్రాండ్‌కి సుమారు 650కి పైగా ఔట్‌లెట్‌లు ఉండటం విశేషం. ఇక్కడ చాయ్ ధర రూ. 15 రూలు. కాఫీ ధర రూ. 20లు, కోల్డ్ కాఫీ, షేక్‌ల ధర కేవలం రూ. 70లే. ఈ చాయ్ బ్రాండ్ అందించే వాటిలో అత్యంత విశేషమైనది కుల్హడ్ చాయ్. దీన్ని మట్టి కప్పుల్లో అందిస్తారు.
అంతేగాదు ఇక్కడ అందించే చాయ్ మెనూలో అల్లం టీ, తులసీ, కేసర్ వంటి ప్లేవర్‌లు అందుబాటు ధరల్లో ఉంటాయి. ఈ బాండ్ ఫ్రాంచైజీ పద్ధతిలో పనిచేస్తుంటుంది. అందుకే తన ప్రాంచైంజీని ప్రారంభించే ముందు 15 రోజుల శిక్షణ కూడా ఇస్తారట. ప్రస్తుతం ఇది సుమారు రూ. 100 కోట్ల పైనే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ బ్రాండ్ ఇటీవలే నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో తన బ్రాండ్ కార్యకలాపాలను ప్రారంభించింది కూడా.
ఇదీ చదవండి: కొడుకుని మార్చబోయి.. ఆమెనే గేమింగ్ క్వీన్‌గా! వైరల్‌గా 60 ఏళ్ల ఆంటీ స్టోరీ


