'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు | Dilraju Once Again Reacts On Game Changer Failure, Check His Comments Inside | Sakshi
Sakshi News home page

Dilraju: తప్పు జరిగినప్పుడు ప్రొడ్యూసర్‌గా ఆపాలి.. కానీ!

Jun 24 2025 7:14 AM | Updated on Jun 24 2025 10:09 AM

Dilraju Once Again Reacts On Game Changer Failure

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గేమ్ ఛేంజర్'.. దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. తొలిరోజు తొలి ఆటకే ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. అయితే హీరో-నిర్మాత దీని గురించి పెద్దగా స్పందించలేదు కానీ దర్శకుడు, ఎడిటర్ మాత్రం కొన్నిరోజుల తర్వాత మాట్లాడారు. తమది తప్పు కాదన్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే 'తమ్ముడు' సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు 'గేమ్ ఛేంజర్' ఫెయిల్యూర్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ముక్కుసూటిగా సమాధానం చెప్పేశారు.

దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో జడ్జిమెంట్, ఫిల్మ్ మేకింగ్‌లో అనుభవం అనే బ్రాండ్ ఉంది. మీరు తీసే సినిమాలో మీకు తెలియకుండా ఏమీ జరగదంటారు. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలా ఎందుకు జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులతో చేసినప్పుడు 100 శాతం ఆ సమస్య ఉంటుంది. దిల్ రాజుకే కాదు. అందరికీ ఆ ప్రాబ్లమ్ తప్పదు. సినిమాని నాలుగున్నర గంటలు తీశారని ఎడిటర్ చెప్పింది నిజమే. పెద్ద డైరెక్టర్‌తో చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేం'

(ఇదీ చదవండి: థగ్‌ లైఫ్‌ డిజాస్టర్‌.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను: మణిరత్నం)

'అయితే రోజూ కిచిడీ ఉంటుంది. రోజూ కావాలా.. మొత్తం అయిపోయాక ఒక్కసారి చూసుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి. తప్పు జరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఆపాలి. దానిని ఆపలేకపోయానంటే అది నా వైఫల్యమే. అలాంటి ప్రాజెక్ట్‌ని నేను చేసి ఉండకూడదు. నా కెరీర్‌లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ పెద్ద దర్శకులతో సినిమాలు చేయలేదు. అందువల్ల నా మొదటి తప్పుడు నిర్ణంయం అదే. పెద్ద దర్శకుడితో తీస్తున్నప్పుడు ముందే కాంట్రాక్ట్‌లో క్లియర్‌గా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్లాలి. అలా చేయలేకపోయాను. అది నా తప్పు'

'ఆ తప్పుని అంగీకరించి దానిని అక్కడితో వదిలేశాను. అది మన స్కూల్ కాదు. అలా కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్' అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలానే చివరి నిమిషం వరకు మీరు సినిమా చూడలేదట కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అది మాత్రం తప్పు, తాను ముందే సినిమా చూశానని చెప్పారు. ఏదేమైనా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తప్పుని హుందాగా ఒప్పుకోవడం కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement
 
Advertisement
Advertisement