ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ | Upcoming OTT Movies In Telugu June Last Week 2025 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఒక్కవారం ఓటీటీల్లోకి 18 మూవీస్.. అవేంటంటే?

Jun 23 2025 7:31 AM | Updated on Jun 23 2025 8:49 AM

Upcoming OTT Movies In Telugu June Last Week 2025

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ కానుంది. అలానే హిందీలో 'మా' అనే హారర్ మూవీ రాబోతుంది. ఇవి తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 18కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే ఈ లెక్క కనిపిస్తుంది. వీకెండ్ వచ్చేసరికి నంబర్ పెరగొచ్చు. 

(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వారమే రైడ్ 2, ఒక పథకం ప్రకారం సినిమాలతో పాటు స్క్విడ్ గేమ్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 4, విరాటపాలెం సిరీస్‌లు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (జూన్ 23 నుంచి 29 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24

  • ట్రైన్ రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24

  • ద అల్టిమేటమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 25

  • రైడ్ 2 (హిందీ సినిమా) - జూన్ 27

  • స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 27

అమెజాన్ ప్రైమ్

  • పంచాయత్ సీజన్ 4 (హిందీ సిరీస్) - జూన్ 24

హాట్‌స్టార్

  • స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26

  • ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26

  • మిస్త్రీ (హిందీ సిరీస్) - జూన్ 27

జీ5

  • విరాటపాలెం (తెలుగు సిరీస్) - జూన్ 27

  • బిబీషణ్ (బెంగాలీ సిరీస్) - జూన్ 27

  • అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) - జూన్ 28

సన్ నెక్స్ట్

  • అజాదీ (తమిళ సినిమా) - జూన్ 27

  • ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) - జూన్ 27

బుక్ మై షో

  • అల్ఫా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24

  • ద బ్రేకప్ క్లబ్ (డచ్ మూవీ) - జూన్ 24

  • రక్తబీజ్ (గుజరాతీ సినిమా) - జూన్ 26

ఆపిల్ ప్లస్ టీవీ

  • స్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27

(ఇదీ చదవండి: ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?)

Advertisement
 
Advertisement
Advertisement