breaking news
Oka Pathakam Prakaaram Movie
-
ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే వెండితెరపై ఆశించిన స్థాయిలో విజయం సాధించని ఈ చిత్రం.. డిజిటల్ స్క్రీన్‌పై మాత్రం దూసుకెళ్తుంది. జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అతున్న ఈ చిత్రం.. రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ మాట్లాడుతూ... ''మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది’ అన్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల మీద అతని మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ కానుంది. అలానే హిందీలో 'మా' అనే హారర్ మూవీ రాబోతుంది. ఇవి తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 18కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే ఈ లెక్క కనిపిస్తుంది. వీకెండ్ వచ్చేసరికి నంబర్ పెరగొచ్చు. (ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వారమే రైడ్ 2, ఒక పథకం ప్రకారం సినిమాలతో పాటు స్క్విడ్ గేమ్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 4, విరాటపాలెం సిరీస్‌లు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (జూన్ 23 నుంచి 29 వరకు)నెట్ఫ్లిక్స్స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24ట్రైన్ రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24ద అల్టిమేటమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 25రైడ్ 2 (హిందీ సినిమా) - జూన్ 27స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 27అమెజాన్ ప్రైమ్పంచాయత్ సీజన్ 4 (హిందీ సిరీస్) - జూన్ 24హాట్స్టార్స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26మిస్త్రీ (హిందీ సిరీస్) - జూన్ 27జీ5విరాటపాలెం (తెలుగు సిరీస్) - జూన్ 27బిబీషణ్ (బెంగాలీ సిరీస్) - జూన్ 27అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) - జూన్ 28సన్ నెక్స్ట్అజాదీ (తమిళ సినిమా) - జూన్ 27ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) - జూన్ 27బుక్ మై షోఅల్ఫా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24ద బ్రేకప్ క్లబ్ (డచ్ మూవీ) - జూన్ 24రక్తబీజ్ (గుజరాతీ సినిమా) - జూన్ 26ఆపిల్ ప్లస్ టీవీస్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27(ఇదీ చదవండి: ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?) -
సాయిరామ్ శంకర్ సస్పెన్స్ థ్రిల్లర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో సాయిరాం శంకర్. 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సినిమాలు చేసిన వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని మూవీ టీమ్ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.ఒక పథకం ప్రకారం కథేంటంటే..ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్‌కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్‌గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్‌ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచే హింట్ ఇస్తూ వచ్చారు మేకర్స్ దానికి తోడు విలన్ ఎవరో కనిపెడితే పట్టుకుంటే పదివేలు అనే అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ఓపెనింగ్ నుంచే కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఏది గతమో.. ఏది ప్రస్తుతమో అర్థకాక ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్కి గురవడం ఖాయం. అయితే సిద్ధార్థ హత్య కేసులో చిక్కుకున్న తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో కొంత క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ హీరో మీద అనుమానాలు పెంచేలా ఉంటుంది.ఆ తర్వాత సెకండ్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్‌గా తీసుకువెళ్లడంలో డైరెక్టర్ కొంతమేర సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు అంచనా వేసే విధంగానే ఉన్న దానిని కనెక్ట్ చేయడం మాత్రం ఫర్వాలేదనిపించేలా ఉంది. అయితే అసలు విలన్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ చిత్రం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితం సినిమా కావడంతో విజువల్స్ కొన్ చోట్ల లాజిక్ లెస్ సీన్స్గా ఉన్నాయి. కానీ సస్పెన్స్ విషయంలో మాత్రం దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ కూడా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మలయాళ దర్శకుడు కావడంతో మలయాళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..నటీనటుల విషయానికి వస్తే లాయర్ పాత్రలో సాయిరాం శంకర్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఆషిమా నర్వాల్ తన పాత్ర మేర మెప్పించింది. కొంత సేపైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖని, శృతి సోది, సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు. ఇక సాంకేతి అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కత్తెరకు పని చెప్పాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
25 కుక్కలతో యాక్షన్ సీన్.. అదే హైలెట్: హీరో సాయి రామ్ శంకర్
'ఒక పథకం ప్రకారం'సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్ కోసం 25 డాగ్స్‌ని తెచ్చారు. వాటితో ఫైట్ సీన్ షూట్ చేస్తుంటే.. ఓ కుక్క నాపై అటాక్ చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో నేను ఒక్కడినే గ్రిల్లో ఉన్నాను. భయంతో గ్రిల్ ఎక్కేశాను. ఆ పని చేయకపోతే ఆ డాగ్ నన్ను కచ్చితంగా కరిచేది. రిస్క్ చేసి తీసిన ఆ యాక్షన్ సీన్ అదిరిపోయింది’ అన్నారు హీరో సాయి రామ్ శంకర్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సాయి రామ్ శంకర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'ఒక పథకం ప్రకారం' అంటే 80% క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి 'ఒక పథకం ప్రకారం' అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం.→ వినోద్ కుమార్ విజయన్ మలయాళ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు సినిమాలు, ఇక్కడి స్టైల్ బాగా ఇష్టం. 'మలయాళంలో ఓ పాయింట్ పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరదు, కష్టం' అంటారు డైరెక్టర్ విజయన్. కాబట్టి తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా ఫైట్ సీన్స్ ని, సాంగ్స్ ను డిజైన్ చేశారు. తమిళ ఫైట్ మాస్టర్ ఢిల్లీ బాబు ఫైట్స్ డిజైన్ చేశారు.→ నాకు ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మధ్యలో ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ, నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.→ గతంలో ఇలాంటి ఇలాంటి సస్పెన్స్ జానర్ సినిమా, ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదు. నెల ట్రైనింగ్ తర్వాత రియాలిస్టిక్ గా చేశామన్న సంతృప్తి లభించింది.→ ఇప్పటికి తెలుగులో మాత్రమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇతర భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజీవ్ గారు ఇండియన్ టాప్ కెమెరామన్లలో ఒకరు. అలాగే మలయాళంలో రెండు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు కూడా నేర్చుకున్నారు.→ మా సినిమా రిలీజ్ రోజే తండేల్ కూడా వస్తోంది. అయితే ఆ సినిమాతో మాకు పోటీ లేదు. అది చాలా పెద్ద సినిమా. మేము 'తండేల్'తో పాటు రిలీజ్ చేయట్లేదు. 'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం(నవ్వుతూ..)→ ప్రస్తుతం ఓ మైథలాజికల్ సిరీస్ చేస్తున్నాం. అందులో 60 ఏళ్ల ఓల్డ్ రోల్ నాది. ఇప్పుడు చేస్తున్న సినిమాల లిస్ట్ లో 'రీసౌండ్' ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి.