
'కుబేర' సినిమా వచ్చింది. హిట్ టాక్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కువమంది హీరోగా ధనుష్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలానే కీలక పాత్రలో కనిపించిన నాగార్జునని కూడా ప్రశంసిస్తున్నారు. అయితే నాగ్.. ఈ మూవీ రిలీజ్‌కి ముందు ఒకలా మాట్లాడి తర్వాత మరోలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇవి నాగ్ చెవిన కూడా పడ్డాయి. ఇప్పుడు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
'కుబేర' సక్సెస్ మీట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో మాట్లాడిన నాగార్జున.. 'సినిమా విడుదలకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు. ఇప్పుడేమో నా సినిమా అంటున్నాడు అని కొన్ని మీమ్స్ కనిపించాయి. కొన్ని వెబ్‌సైట్స్‌లో వార్తలు కూడా వచ్చాయి. ఇది దేవా(ధనుష్ పాత్ర పేరు) సినిమా. ఇది దీపక్(నాగ్ పాత్ర పేరు) సినిమా. ఇది సమీర(రష్మిక) సినిమా. అన్నింటికీ మించి ఇది శేఖర్ కమ్ముల సినిమా' అని నాగ్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: నాగ్ నిర్ణయం నాకు స్ఫూర్తినిచ్చింది: చిరంజీవి)
దీనంతటికి కారణం నాగ్ మాటలే. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇది శేఖర్ కమ్ముల మూవీ అని చెప్పారు. రిలీజ్ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతున్న టైంలో తన పాత్ర మెయిన్ అని, దాంతో తానే హీరో అని నాగ్ అన్నారు. ఇది నా సినిమా కూడా అన్నారు. దీంతో ముందు ఇలా అన్నారు తర్వాత ఇలా అన్నారు అని పలు తమిళ క్రిటిక్స్ విమర్శలు చేశారు. ధనుష్‌ని నాగ్ తక్కువ చేసేలా మాట్లాడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇప్పుడు నాగ్ తన కామెంట్స్‌తో వాటికి చెక్ పెట్టేశాడని చెప్పొచ్చు.
ధనుష్,నాగ్, రష్మిక.. ఇలా స్టార్స్ నటించిన 'కుబేర'కు రిలీజ్‌కి ముందు ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే పాజిటివ్ టాక్ వచ్చిందో థియేటర్లు హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. చాలారోజుల నుంచి మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులు.. దీన్ని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో రూ.50 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
(ఇదీ చదవండి: నేను నటించగలనని శేఖర్ కమ్ముల నిరూపించారు: రష్మిక)