
∙రష్మికా మందన్నా, శేఖర్ కమ్ముల, ధనుష్, చిరంజీవి, నాగార్జున
‘‘కుబేర’ సినిమా ఎలా ఉంటుంది? అని నాగ్‌ని అడిగాను. డిఫరెంట్ క్యారెక్టర్ ఎటెమ్ట్ చేశానన్నాడు. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చె΄్పాడు. ఎలా ఒప్పుకున్నావ్ నాగ్ అన్నాను. రెగ్యులర్ హీరో పాత్రలు కాకుండా కొత్తగా చేయాలనిపిస్తోందన్నాడు. నేను ‘కుబేర’ చూశాను. నాగ్ తీసుకున్న ఈ నిర్ణయం నాక్కూడా స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా తర్వాత మరో 40 ఏళ్లు ఇండస్ట్రీలో తాను ఉంటానన్న నాగ్ మాటలు వాస్తవం’’ అని హీరో చిరంజీవి అన్నారు. ధనుష్, నాగార్జున హీరోలుగా, రష్మికా మందన్నా, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది.
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘కుబేర’ సినిమా సక్సెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘దేవా క్యారెక్టర్ చేయగల ఏకైక హీరో ధనుష్. బెస్ట్ యాక్టర్ అవార్డు ధనుష్‌కు మామాలైపోయింది. మాకు ఎప్పుడన్నా వస్తే వావ్... నాకొచ్చిందోచ్... నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అని నేననుకోవాలి. ఇక హ్యూమన్ ఎమోషన్స్‌ను టచ్ చేయగలిగి, కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియన్స్ థియేటర్‌కు వస్తారనే భరోసా ఇచ్చావ్ (శేఖర్ కమ్ములను ఉద్దేశించి). ‘చూడాలని ఉంది’ సినిమాలో అప్పారావు వస్తాడని సౌందర్య అంటుంది.
రష్మిక చేసిన క్యారెక్టర్‌లో నాకు సౌందర్య గుర్తుకు వచ్చింది. సునీల్... నాగార్జున ఎవరి కాళ్లకీ దండం పెట్టడు... ఒక్క మీ నాన్న (నారాయణ్‌దాస్ నారంగ్)గారికి తప్ప. ఆయనంటే నాకూ అంతే ఇష్టం. ‘మీతో సినిమా చేయాలని ఉంది’ అని అడిగావు. ‘సార్.. మా నాన్నగారు మీ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడంతో నైజాంలో బాగా డబ్బులు గడించాం. మీ సినిమాలంటే నైజాం కింగ్ అనుకునేవాళ్లం.
ఆ తర్వాత మా నాన్నగారి బాటలో మేం కూడా మీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాం. మాకు కొంత డబ్బులు వచ్చాయ్ అన్నావు. కానీ అల్లు అరవింద్‌గారు గీతా ఆర్ట్స్ పెట్టిన తర్వాత మీకు సినిమాలు రాకుండా పోయాయి (నవ్వుతూ). అయితే మీ మూడో తరం నిర్మాత జాన్వీకి ఆల్ ది బెస్ట్. మీతో సినిమా చేస్తే మూడు జనరేషన్స్తో సినిమా చేసినట్లవుతుందని మీ (జాన్వీని ఉద్దేశించి) నాన్న (సునీల్ నారంగ్) అన్నారు. మనం చేస్తున్నాం’’ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ – ‘‘కుబేర’ ఎందుకు చేశారని ఓ జర్నలిస్ట్ అడిగితే, దీపక్ (నాగార్జున పాత్ర పేరు) క్యారెక్టర్ చుట్టూ అన్ని పాత్రలు తిరుగుతున్నాయి. ఈ సినిమా నా సినిమా కదా? అనుకుని చేశానని చెప్పాను. దాన్ని సోషల్ మీడియా వాళ్లు సినిమాకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అంటున్నాడు... సినిమా తర్వాత నా సినిమా అంటున్నాడని మీమ్స్ చేశారు. మళ్లీ చెబుతున్నాను... ఇది దేవా సినిమా. దీపక్ సినిమా. ఖుష్బూ సినిమా. అందరి సినిమా. మోస్ట్‌లీ శేఖర్ సినిమా. ‘కుబేర’తో నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు శేఖర్. ఇక నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయనుకుంటున్నా. మరో నలభై సంవత్సరాలు ఉంటాను. ధనుష్ యాక్టింగ్ గురించి ఏం చెప్పినా తక్కువే. రష్మికని చూడగానే నాకు ‘క్షణం క్షణం’ సినిమాలో శ్రీదేవిగారు గుర్తొచ్చారు’’ అని చె΄్పారు.
ధనుష్ మాట్లాడుతూ– ‘‘ఛాపర్స్, బాంబ్ బ్లాస్ట్స్, బ్లడ్... ఇలాంటి అంశాలున్న సినిమాలే ఆడియన్స్ను ఇప్పుడు థియేటర్స్‌కు తీసుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ... ‘కుబేర’లాంటి సినిమాతో చాలామంది ఫిల్మ్ మేకర్స్‌కు శేఖర్‌గారు ఓ హోప్ ఇచ్చారు. హ్యూమన్ ఎమోషన్ ను మించిన గ్రాండియర్ లేదు’’ అని అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఆనంద్, హ్యాపీడేస్, ఫిదా..’ వంటి సినిమాలపై జడ్జ్‌మెంట్ ఉంటుంది. కానీ ‘కుబేర’ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం ఉండేది. ఫస్ట్ డే ఫస్ట్ షోకి నా భయాలను చెల్లాచెదురు చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు.