
స్టార్ హీరోయిన్ సమంత(samantha) కొత్త జర్నీ ప్రారంభించింది. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే..ఇది మంచి నెంబరనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ చిత్రానికి రూ. 3.5 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. రిలీజ్‌కి ముందే సమంత తనకున్న పలుబడితో టేబుల్ ప్రాఫిట్‌ని పొందినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులను మంచి రేటుకే అమ్మేసిందట. షూటింగ్‌కి ముందే ‘జీ’ సంస్థతో డీల్ కుదుర్చుకుందట సమంత. సినిమా మొత్తం ఓ సీరియల్ చుట్టు తిరుగుతుంది.. అది జీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్‌గా చూపిస్తామని ‘బ్రాండింగ్’మాట్లాడుకున్నారట. ఆ తర్వాత అదే సంస్థ ఓటీటీ, శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.
నిజానికి ఇలాంటి చిన్న సినిమాకి రిలీజ్ ముందే బిజినెస్ జరగడం చాలా అరుదు. పెద్ద పెద్ద సినిమాలకే ఓటీటీ బిజినెస్ కావడం లేదు. సమంత ఉంది కాబట్టే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రిలీజ్‌కి ముందే సేల్ అయ్యాయి. ఇక రిలీజ్ తర్వాత మంచి టాక్ రావడం.. వసూళ్లు రోజు రోజుకి పెరగడంతో ‘శుభం’తో సమంతకు మంచి లాభాలే వచ్చేశాయి. మొత్తానికి సమంత కొత్త జర్నీ లాభాలతోనే ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఆమె బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు, బలమైన కథలతో వస్తే, 'సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్'గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.