డైరెక్టర్‌తో సమంత డేటింగ్.. మరోసారి అతనితో కలిసి! | Samantha plays pickleball with Raj Nidimoru Shares with happy weekend | Sakshi
Sakshi News home page

Samantha: డైరెక్టర్‌తో సమంత డేటింగ్.. మరోసారి అతనితో కలిసి!

May 31 2025 6:42 PM | Updated on May 31 2025 7:04 PM

Samantha plays pickleball with Raj Nidimoru Shares with happy weekend

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్‌లో శుభం అనే మూవీని నిర్మించింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ కావడంతో సమంత సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది.

అయితే గత కొద్దికాలంగా హీరోయిన్ సమంతపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో పలుసార్లు జంటగా కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల విమానంలో రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా ఉన్న ఫోటో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఇవీ చూసిన నెటిజన్స్‌ వీరిద్దరు  డేటింగ్‌లో ఉన్నది నిజమేనా? అనే డైలామాలో పడ్డారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు.

తాజాగా సమంత డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను దీనికి కారణం. హ్యాపీ వీకెండ్‌ అంటూ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా పంచుకుంది. వీటిలో రాజ్ నిడిమోరుతో కలిసి సామ్‌ పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. కోర్టులో ఇద్దరు పికిల్‌ బాల్ ఆడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిపై నెట్టింట మరోసారి చర్చ మొదలైంది. శుభం మూవీ విడుదలకు ముందు ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.

కాగా.. సమంత, రాజ్ నిడిమోరు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీసుల్లో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు   'రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement