Samantha: పచ్చబొట్టు చెరిగిపోలేదులే.. | Samantha Ruth Prabhu Not Removed YMC Tattoo, Her is Proof | Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: ఆ స్పెషల్‌ టాటూ ఇంకా పదిలంగానే..

Jul 26 2025 8:00 PM | Updated on Jul 26 2025 8:20 PM

Samantha Ruth Prabhu Not Removed YMC Tattoo, Her is Proof

హీరోయిన్‌గా సమంత (Samantha Ruth Prabhu) వెండితెరకు పరిచయమైన చిత్రం ఏమాయ చేసావె (Ye Maaya Chesave Movie). నాగచైతన్య హీరోగా నటించాడు. 2010లో వచ్చిన ఈ ప్రేమకథాచిత్రంతోనే వీరి లవ్‌కు పునాది పడింది. తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్‌ కావడంతో సామ్‌కు బోలెడంత గుర్తింపు వచ్చింది. అందుకే ఈ స్పెషల్‌ చిత్రానికి గుర్తుగా సామ్‌.. YMC (ఏ మాయ చేసావే) టాటూను మెడపై వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తనకెంతో స్పెషల్‌ అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.

పచ్చబొట్టు మాయం?
ఇదే కాదు. చై ప్రేమకు గుర్తుగా కూడా ఓ పచ్చబొట్టు వేయించుకుంది. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఆ టూటూ తొలగించుకుంది. ఇటీవల ఓ వీడియో YMC పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఆ గుర్తును కూడా పూర్తిగా చెరిపేసుకుందని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా సామ్‌ పోస్ట్‌ చేసిన ఫోటోల్లో ఆ పేరు అలాగే చెక్కుచెదరకుండా ఉంది.

విడాకులు
నాగచైతన్య-సమంత 2017లో పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా ఉండే ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. చై.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సామ్‌ కూడా.. దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే.. సమంత చివరగా శుభం చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతోనే తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌ వెబ్‌సిరీస్‌తో పాటు మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది.

 

 

చదవండి: నా భార్య కండీషన్‌.. ఇప్పటికీ అదే పాటిస్తున్నా: మురళీ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement