
సమంత ఇటీవల నిర్మాతగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన సొంత బ్యానర్‌లో నిర్మించిన శుభం మూవీతో నిర్మాతగా మారిపోయింది. మే 9న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను సామ్ ఎంజాయ్ చేస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా తనకు ఎదురలేదని చెబుతోంది సమంత. అయితే తాజాగా శుభం సినిమా వీక్షించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోల్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా సామ్‌తో పాటే ఉన్నారు. శుభం వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
అయితే గత కొద్దికాలంగా సమంతపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. దీనికి కారణం సిటాడెల్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరు. అతనితో ఇప్పటికే సమంత చాలాసార్లు పలు వేదికలపై జంటగా కనిపించింది. పికిల్ బాల్ లీగ్‌లో వీరిద్దరూ ఒక్కసారిగా వేదికపై మెరిశారు. అప్పుడు కూడా రాజ్‌తో సామ్ డేటింగ్‌లో ఉందని వార్తలొచ్చాయి.

తాజాగా మరోసారి శుభం మూవీని సమంత, రాజ్ కలిసి వీక్షించిన ఫోటోలు షేర్ చేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ ఫోటోల్లో విమానంలో రాజ్ భుజాలపై సన్నిహితంగా కనిపిస్తూ పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోతో రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారంటూ పోస్టులు పెడుతున్నారు. మరో నెటిజన్స్ ఈ జంటకు సామ్రాజ్ అనే కొత్త పేరు బాగుంటుందని కామెంట్ చేశాడు. ఏదేమైనా వీరిద్దరు కలిస్తే డేటింగ్ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఫుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాగా. గతంలో తిరుమలకు వెళ్లిన సమయంలోనూ సమంత, రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు.