సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే | Samantha Not Removed YMC Tattoo Latest | Sakshi
Sakshi News home page

Samantha: చైతూ గుర్తుని చెరిపేసిందన్నారు.. కానీ ఇప్పుడేమో?

Jun 17 2025 2:10 PM | Updated on Jun 17 2025 4:03 PM

Samantha Not Removed YMC Tattoo Latest

సమంత పేరు చెప్పగానే చాలామందికి సినిమాలతో ఆమె వైవాహిక జీవితం కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో నాగచైతన్యని కొన్నాళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాకపోతే ఇద్దరూ సరిపడక నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంది. చైతూ మాత్రం హీరోయిన్ శోభితని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ లైఫ్‍‌ని ఎంజాయ్ చేస్తున్నాడు.

సరే ఈ విషయాల్ని కాసేపు పక్కనబెడితే చైతూతో ప్రేమ,పెళ్లి బంధంలోకి వెళ్లిన తర్వాత సమంత ఓ మూడు టాటూలు వేయించుకుంది. వాటిలో పక్కటెముకల మీద చైతూ అనే పేరు, అలానే చేతిపై మోర్స్ కోడ్‌లో చైతూ పేరు రాయించుకుంది. ప్రస్తుతానికైతే ఈ రెండు గుర్తుల్ని చెరిపేసుకుంది. అయితే మెడ వెనక భాగంలో సామ్.. 'వైఎంసీ' (ఏ మాయ చేశావె) టాటూ కూడా వేయించుకుంది. కొన్నిరోజుల క్రితం దీన్ని తీయించేసుకుందనే వార్తలు వచ్చాయి.

(ఇదీ చదవండి: 'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ)

అయితే అప్పట్లో ఓ మ్యాగజైన్ కోసం తీయించుకున్న ఫొటోల్లో మేకప్‌తో సామ్.. తన టాటూని కవర్ చేసుకుంది. ఆ విషయం ఇప్పడు క్లారిటీ వచ్చింది. తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ జిమ్ నుంచి సమంత బయటకొస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో మెడ వెనక భాగంలో 'వైఎంసీ' టాటూ కనిపించింది. ఇకపోతే 'ఏ మాయ చేశావె' సినిమా రీ రిలీజ్ కానుంది. జూలై 18న మరోసారి థియేటర్లలోకి రానుంది.

ఓవైపు చైతూ..  శోభితని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు సమంత కూడా 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్‌లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వీళ్లు కలిసి కనిపించడంతో నెటిజన్లు ఇలా మాట్లాడుకున్నారు. ఇదివరకే రాజ్‌కి పెళ్లయింది. ఈ డేటింగ్ రూమర్స్ చూసి రాజ్ భార్య, భర్తని ఉద్దేశిస్తూ పరోక్షంగా కొన్ని పోస్టులు కూడా పెట్టింది. సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు.

(ఇదీ చదవండి: సేతుపతి కోసం హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్)

Advertisement
 
Advertisement
Advertisement