నాగచైతన్యతో మొదటి సీన్.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: సమంత | Samantha Ruth Prabhu remembers Ye Maaya Chesave with Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Samantha: నాగచైతన్యతో మొదటి సీన్.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: సమంత

Mar 4 2025 4:29 PM | Updated on Mar 4 2025 4:51 PM

Samantha Ruth Prabhu remembers Ye Maaya Chesave with Naga Chaitanya

టాలీవుడ్‌ హీరోయిన్ సమంతకు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో హాల్ ఆఫ్ ఫేమ్‌ అవార్డ్‌ను అందుకుంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో సమంతకు అవార్డ్‌ను బహుకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన తొలి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో ఏ మాయ చేశావే మూవీతో సామ్ సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి సమంత మాట్లాడింది. ఈ సినిమాలో ప్రతి షాట్‌ తన జీవితాంతం గుర్తుండిపోతుందని వెల్లడించింది. అయితే ఈ 15 ఏళ్లలో తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవటం వల్ల కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయాననని తెలిపింది. అంతేకాకుడా తనకు తమిళం రాకపోవడం వల్ల ఇబ్బంది పడినట్లు సామ్ చెప్పింది.

అయితే సమంతా 2010లో రాహుల్ రవీంద్రన్‌తో మాస్కోయిన్ కావేరిలో నటించింది. అయితే ఆ సినిమా ఏమాయ చేశావే కంటే ముందే చిత్రీకరించినప్పటికీ విడుదల కాలేదు. ఆ సినిమా కంటే తనకు నాగ చైతన్యతో చేసిన సినిమాలోని ప్రతి షాట్ గుర్తుండిపోతుందని సమంత చెబుతోంది. ఈ చిత్రంలో జెస్సీ పాత్రలో కార్తీక్‌ను కలిసే మొదటి సన్నివేశం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని సమంత వెల్లడించింది. గౌతమ్ మీనన్‌తో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవమని తెలిపింది.

కాగా.. 2010లో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, మహేశ్ బాబు దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. అంతేకాకుండా గతేడాది వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో నటించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement