డేటింగ్ వార్తలకు తెరదించుతూ సమంత- రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో యోగ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సామ్-రాజ్ ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.
అటు సామ్(Samantha)కి, ఇటు రాజ్‌కి ఇది రెండో పెళ్లి. 2017లో సమంత.. నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సామ్ మాత్రం ఒంటరిగా ఉంది. రాజ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె స్పందించలేదు. ఇప్పుడు సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది.
(చదవండి: సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!)
ఇదిలా ఉంటే.. సామ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే.. సోషల్ మీడియా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. గతంలో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్‌గా మాట్లాడారు.
‘నా జీవితంలో ఏదైనా జరిగింది(విడాకులు).. అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడినే క్రిమినల్‌గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను.
వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్‌గా అయిపోయి.. గాసిప్‌లా మార్చేసి.. చివరకు ఆ టాపిక్‌ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా మార్చేశారు. నేను చాలా సార్లు ఆలోచించాను. బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే.. దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. అందుకే మాట్లాడలేదు. రాసేవాళ్లే దీనికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలి’ అని చైతూ చెప్పుకొచ్చాడు.
The moment he's speaking with a well-disciplined expression I'm came here from a broken family, Naaku thelusu aa pain ento.
Hatts off to your Maturity levels 📈 #NagaChaitanya ❤️🩹🛐 pic.twitter.com/8aYYqCU9HX— Amoxicillin (@__Amoxicillin_) December 1, 2025


