సమంతకు చేదు అనుభవం.. జిమ్ నుంచి బయటకు రాగానే! | Samantha Loses Cool At Paps For Clicking Her Photos Outside Gym | Sakshi
Sakshi News home page

Samantha: ఇలా తగులుకున్నారేంట్రా?.. సమంత తీవ్ర అసహనం!

Jun 17 2025 3:52 PM | Updated on Jun 17 2025 4:03 PM

Samantha Loses Cool At Paps For Clicking Her Photos Outside Gym

టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం ముంబయిలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరు తెరకెక్కించనున్న రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్‌ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది.

అయితే తాజాగా ముంబయిలో సమంతకు చేదు అనుభవం ఎదురైంది. బాంద్రాలో జిమ్‌ చేసి బయటికి వస్తుండగా ఆమెను ఒక్కసారిగా ఫోటోలు తీసుకునేందుకు చుట్టుముట్టారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన సామ్.. అరే రూకోజి ప్లీజ్‌ అంటూ హిందీలో మాట్లాడుతూ అసహనంగా కనిపించింది. ఆమె కారు ఇంకా రాకపోవడంతోనే బయట నిలబడాల్సి రావడంతో ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత అసహన వ్యక్తం చేసింది.

కాగా.. గతేడాది సిటాడెల్: హనీ బన్నీలో వరుణ్ ధావన్‌తో కలిసి చివరిసారిగా కనిపించింది. అయితే ఆ తర్వాత సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement