సమంతపై ట్రోలింగ్.. ఆ వీడియోతో ఇచ్చిపడేసిన సామ్! | Samantha hits back at trolls calling her skinny sickly with fierce workout video | Sakshi
Sakshi News home page

Samantha: సమంతపై ట్రోలింగ్.. ఆ వీడియోతో ఇచ్చిపడేసిన సామ్!

Jun 29 2025 4:23 PM | Updated on Jun 29 2025 4:48 PM

Samantha hits back at trolls calling her skinny sickly with fierce workout video

శుభం మూవీ తర్వాత సమంత సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. సోషల్ మీడియాలో ఇటీవల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ తెగ బిజీ అయిపోయింది. ముంబయిలో జిమ్‌ వెలుపల ఆమె కనిపించడంతో కొందరు ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత కాస్తా అసహనానికి గురైంది.

ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. అందులో వీడియోతో పాటు ఓ కోటేషన్‌ కూడా రాసుకొచ్చింది. తన బాడీ గురించి కామెంట్స్‌ వారిని ఉద్దేశించి అందులో ప్రస్తావించింది. వీటిలో మొదటి మూడు చేయగలిగితే తప్ప నన్ను సన్నగా, అనారోగ్యంగా ఉన్నారని అలా చెత్తగా మీరు పిలవలేరు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఇది తన బాడీని షేమింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలను కూడా పంచుకుంది. సమంత తన వర్కౌట్ వీడియోతో ట్రోలర్స్‌కు సవాలు విసురుతోంది.

sama


కాగా.. సమంత చివరిసారిగా శుభం సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించింది. అంతకుముందు వెబ్ సిరీస్‌  'సిటాడెల్: హనీ బన్నీ'లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం 'రఖ్త్ బ్రహ్మండ్'తో పాటు 'బంగారం' అనే తెలుగు చిత్రంలో కనిపించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement