నేను కూడా సెల్ఫిష్‌.. రివ్యూల విషయంలోనూ అంతే: సమంత | Tollywood actress Samantha comments On reviews In Shubham Success Meet | Sakshi
Sakshi News home page

Samantha: నేను కూడా సెల్ఫిష్‌.. రివ్యూల విషయంలో నా తర్వాతే: సమంత

May 16 2025 7:33 PM | Updated on May 16 2025 7:58 PM

Tollywood actress Samantha comments On reviews In Shubham Success Meet

హీరోయిన్ సమంత ప్రస్తుతం శుభం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టిన సామ్.. కొద్ది రోజులుగా ఫుల్ బిజీ అయిపోయింది. సామ్ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన శుభం మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత సైతం అతిథి పాత్రలో మెరిసింది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ రావడంతో టీమ్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన శుభం సక్సెస్‌ మీట్‌లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా సినిమా రివ్యూల గురించి ప్రస్తావించింది.

(ఇది చదవండి: Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ)

తాను కూడా సినిమా రివ్యూలను చదువుతానని సామ్ తెలిపింది. అయితే కేవలం తన పాత్రకు సంబంధించినంత వరకే పరిమితమవుతానని వెల్లడించింది. నా గురించి చదివాకే.. మిగిలిన వారి గురించి చూస్తానని సమంత పేర్కొంది. ఈ విషయంలో నేను కూడా చాలా సెల్ఫిష్‌ అంటూ సామ్ షాకింగ్ కామెంట్స్ చేసింది.  కానీ . కానీ, నిర్మాతగా మారాక అభిప్రాయం మార్చుకున్నట్లు తెలిపింది సమంత.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement