
టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఇటీవల ఎక్కువగా మార్మోగిపోతోంది. ఎక్కడికెళ్లినా ఆమెతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కనిపించడం మరోసారి చర్చకు దారితీసింది. ఇద్దరు కలిసి డిన్నర్ తర్వాత ఓకే కారులో వెళ్లడంతో ఈ జంట డేటింగ్పై మరోసారి మొదలైంది. కొద్ది రోజుల క్రితమే లండన్ వీధుల్లో ఇద్దరు కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
అయితే తాజాగా ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫోటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రెస్టారెంట్‌లో చిల్ అవుతూ కనిపించింది. ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం మరో చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఎప్పుడు కనిపించని ప్రత్యేకమైన రింగ్ సామ్ చేతికి ఉండడంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సామ్ ఎపిసోడ్ టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనుందా అనే చర్చ మొదలైంది.
కాగా.. సమంత.. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో నటించారు. రాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీమ్యాన్ సీజన్- 2, సిటాడెల్: హనీ బన్నీలోసామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్‌ల సమయంలోనే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.