మీరిద్దరు శుభంతో జర్నీ మొదలెట్టారు.. ఎప్పటికీ అలాగే ఉండాలి: సమంతపై టాలీవుడ్ నటి కామెంట్స్ | Tollywood actress Madhumani Comments On Samantha and raj nidimoru | Sakshi
Sakshi News home page

Samantha: రాజ్‌ - సామ్ శుభంతో మొదలెట్టారు.. ఎప్పటికీ ఇలానే ఉండాలి: నటి మధుమణి

May 16 2025 6:41 PM | Updated on May 16 2025 7:20 PM

Tollywood actress Madhumani Comments On Samantha and raj nidimoru

ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తాను నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కించిన శుభం మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో సామ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తన టీమ్‌తో కలిసి సక్సెస్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నటి మధుమణి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.

మధుమణి మాట్లాడుతూ..'నా 39 ఏళ్ల ప్రయాణంలో చాలా అవార్డులు గెలుచుకున్నా. ఎంతో హీరోలతో పాటు హీరోయిన్లకు తల్లిగా నటించా. కానీ సమంతతో ఒక్క సినిమా కూడా చేయలేదు. తనకు రంగస్థలంలో అమ్మగా నటించే అవకాశం చేజారిపోయింది. ఆ బాధ ఇప్పటికీ ఉంది. శుభం కోసం నన్ను సంప్రదించినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నా అదృష్టం కలిసొచ్చి శుభం మూవీలో నటించా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్‌కు శుభం. రాజ్ మీరు కలిసి శుభంతో ప్రయాణం మొదలెట్టారు. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. శతమానం భవతి అంటూ' అని ఇద్దరినీ దీవించింది.

అయితే ఇది విన్న సమంత ఫ్యాన్స్‌ కాస్తా షాకింగ్‌కు గురవుతున్నారు. రాజ్ నిడిమోరు- సామ్ డేటింగ్‌పై చర్చ జరుగుతున్న వేళ మధుమణి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా..ఇటీవల మరోసారి సమంత-రాజ్ నిడిమోరు గురించి మరోసారి చర్చ మొదలైన సంగతి తెలిసిందే. రాజ్ నిడిమోరు తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2, సిటాడెల్‌: హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే. సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్‌ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement