రిపబ్లిక్ డే వేడుకల్లో హీరోయిన్ సమంత కనిపించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఒక రోజు ఇక్కడికి వస్తానని నా అంతరాత్మ కూడా ఎప్పుడు అనుకోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సమంత తన పోస్ట్‌లో రాస్తూ..' నేను ఎదుగుతున్నప్పుడు నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు... నేను ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తానని నా అంతరాత్మ కూడా ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఎలాంటి మార్గదర్శకత్వం లేదు... ఇలాంటి కలలు ఒకప్పుడు ఊహించుకోవడానికి కూడా చాలా పెద్దగా అనిపించేవి. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ఈ దేశంలో నేను కేవలం నా పని చేసుకుంటూ ముందుకు సాగిపోయాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని' అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.


