– సమంత
‘‘మనం హింస గురించి ఆలోచించినప్పుడు వీధుల్లో, ఇంట్లో, పని ప్రదేశాల్లో జరుగుతుందనుకుంటాం. కానీ, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా జరుగుతోంది. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ హింసని ఎదుర్కొంటోంది’’ అని పేర్కొన్నారు సమంత.
మహిళలపై పెరుగుతోన్న ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేయనున్నారామె. మహిళల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అంటూ యూఎన్ విమెన్ ఇండియా నిర్వహిస్తున్న ‘నో ఎక్స్‌క్యూజ్’ కార్యక్రమానికి సమంత మద్దతుగా నిలిచారు. నవంబరు 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 10 వరకు జరగనుంది. ‘‘సోషల్ మీడియాలో కామెంట్స్, ఆన్‌లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫొటోలు వంటివన్నీ జరుగుతున్నాయి.
ఇవి మహిళలు నలుగురిలో తమ గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తున్నాయి... అభద్రతాభావాన్ని కలిగిస్తున్నాయి. నేను ఎన్నోసార్లు ఈ పరిస్థితిని అనుభవించాను. వేధింపుల వల్ల చాలామంది మహిళల జీవితాలు, కెరీర్ ఆగిపోయాయి. ఆన్‌లైన్‌లో అబ్యూజ్ చేయడాన్ని జోక్‌గా ట్రీట్ చేయడం ఆపేస్తే మనం ఇంటర్నెట్‌ని బెటర్‌గా మార్చొచ్చు. ఆన్‌లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు రావాలి. ఇది మహిళలకు భద్రతగా మారుతుంది. ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన పెరగాలి’’ అని సమంత పేర్కొన్నారు.


