
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఈ మధ్యే కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఆల్‌రెడీ సినిమాలు చేస్తోంది, నిర్మిస్తోంది. ఓ పక్క ఆరోగ్యం గురించి అవేర్‌నెస్ కల్పిస్తోంది, మరోవైపు ఫ్యాషన్, పర్‌ఫ్యూమ్ బిజినెస్ చేస్తోంది. అలాగే ఏకం అనే లెర్నింగ్ సెంటర్‌ని నడిపిస్తోంది. ఆ మధ్య పికిల్‌బాల్ టీమ్ కూడా కొనుగోలు చేసి వార్తల్లోకెక్కింది. ఇంకా కొత్త జర్నీ ఏంటనుకుంటున్నారా? మరేం లేదు.. తనకంటూ ఓ ఇల్లు కొనుగోలు చేసింది.
ఈమధ్యే గృహప్రవేశం
అందులోనే తన ప్రయాణం ఉండబోతుందని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇటీవలే గృహప్రవేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో సమంత ఎరుపు రంగు డ్రెస్ సాంప్రదాయంగా ముస్తాబైంది. ముఖానికి కుంకుమ పెట్టుకుని పూజలో పాల్గొంది. పూజగది ఫోటోను షేర్ చేసింది. అలాగే తన జిమ్ వర్కవుట్స్ వీడియోను కూడా జత చేసింది.
సినిమా
టాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసిన సమంత.. ‘ట్రలాలా’ బేనర్‌తో నిర్మాతగా మారింది. తన సొంత బ్యానర్‌పై తొలిసారి ‘శుభం’ చిత్రాన్ని నిర్మించింది. ఇదే బేనర్‌లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తోంది. అలాగే రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ అనే హిందీ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది.
చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది రిసెప్షన్ వేడుక.. సతీసమేతంగా హాజరైన అక్కినేని అఖిల్