
టాలీవుడ్ హీరో నార్నే నితిన్ ఓ ఇంటివాడయ్యారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ నెల పదో తేదీన వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. మ్యాడ్ స్క్వేర్ మూవీతో ఫేమస్ అయిన నితిన్ మన యంగ్ టైగర్ బామ్మర్ది అన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్‌తో అభిమానులను అలరించిన హీరో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు.
తాజాగా నితిన్ -శివానీల వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో మన అక్కినేని హీరో అఖిల్ కూడా పాల్గొన్నారు. తన సతీమణి జైనాబ్ రవ్దీతో కలిసి గ్రాండ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అఖిల్ తన భార్య చేయి పట్టుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.