
మెగా హీరో రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం రంగస్థలం. ఈ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్‌గా మెప్పించిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు.
అయితే రంగస్థలం విడుదలై ఇప్పటికే ఏడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగులో బుల్లితెరపై అలరించిన ఈ సినిమా.. ఇప్పటివరకు హిందీ మాత్రం రాలేదు. తాజాగా రంగస్థలం సినిమాను ఏడేళ్ల తర్వాత హిందీలో బుల్లితెరపై సందడి చేయనుంది. ఆగస్టు 24న రాత్రి 8 గంటలకు గోల్ట్ మైన్స్ ఛానెల్‌లో రంగస్థలం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ట్విటర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో బాలీవుడ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#Rangasthalam (Hindi) | 24th August Sunday 8:00 PM | Tv Par Pehli Baar | Primere Only On #Goldmines TV Channel#RangasthalamHindi #rangasthalammovie @AlwaysRamCharan @Samanthaprabhu2 #JagapathiBabu #AnasuyaBharadwaj @prakashraaj #RamCharan #samantharuthprabhu pic.twitter.com/4OebzT3gJs
— Goldmines Telefilms (@GTelefilms) July 28, 2025