బంగారం ఆన్‌ సెట్‌ | Samantha begins Maa Inti Bangaram shooting | Sakshi
Sakshi News home page

బంగారం ఆన్‌ సెట్‌

Oct 28 2025 12:48 AM | Updated on Oct 28 2025 12:48 AM

Samantha begins Maa Inti Bangaram shooting

‘‘సన్నిహితులు, స్నేహితుల ప్రేమ, ఆశీర్వాదాల నడుమ ‘మా ఇంటి బంగారం’ ముహూర్తంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ స్పెషల్‌ మూవీ ఆరంభించిన సందర్భంగా అందరి ప్రేమ, సహకారం మాకు కావాలి’’ అని సమంత పేర్కొన్నారు. ఆమె లీడ్‌ రోల్‌లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించి కొన్ని నెలలైంది. ఫైనల్‌గా సోమవారం ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లింది.

 ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ‘శుభం’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సమంత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్‌ దేవయ్య తదితరులు ప్రధానపాత్రల్లో, గౌతమి, మంజుషా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమంత, రాజ్‌ నిడుమోరు, హిమాంక్‌ దువ్వూరు నిర్మిస్తున్నారు. ‘ఓ బేబి’ వంటి సూపర్‌ హిట్‌ మూవీ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ యాక్షన్‌ మూవీకి సంగీతం: సంతోష్‌ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాశ్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement