మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల! | Amala Akkineni attended an event celebrating ex daughter in law Samantha | Sakshi
Sakshi News home page

Amala Akkineni: మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!

May 22 2025 1:37 PM | Updated on May 22 2025 2:21 PM

Amala Akkineni attended an event celebrating ex daughter in law Samantha

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. శుభం మూవీతో ఓ చిన్న పాత్రలో కనిపించిన సామ్.. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌లో నిర్మించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలోనే సమంత టీమ్ సక్సెస్‌ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకుంది. ఈ ఈవెంట్‌లో సమంత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జర్నీని తలచుకుంటూ ఎమోషనలైంది సామ్.

తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన సినిమా అవార్డ్ ఈవెంట్‌లో మెరిసింది సమంత. ఈ ఈవెంట్‌లో 15 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న సమంతను ప్రత్యేకమైన అవార్డ్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా సమంత టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తెలుగు సినిమా పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది.. ఇదే నా కర్మ భూమి అంటూ భావోద్వేగ ప్రకటన చేసింది. ఇదే ఈవెంట్‌కు హాజరైన అక్కినేని అమల.. సమంతను కొనియాడుతూ చప్పట్లు కొట్టి అభినందించింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇది చూసిన అభిమానులు అక్కినేని అమల తన మాజీ కోడలికి అభినందనలు తెలిపారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా..  2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'యే మాయ చేసావే' చిత్రంతో సమంత రూత్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, కత్తి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2018లో అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లాడిన సమంత ఆ తర్వాత  2021లో విడాకులు తీసుకుంది. గతేడాది నాగచైతన్య హీరోయిన్‌ శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నారు. మరోవైపు సమంత బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement