
స్టార్ హీరోయిన్ సమంత భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమను జీవితంలో మరవలేనని, తన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. తప్పు చేసినా.. వారు మాత్రం ఎప్పుడూ తనవెంటే ఉన్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా ఆమె అమెరికాలో జరిగిన తానా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత స్టేజ్‌పై స్పీచ్ ఇస్తూ మధ్యలో ఎమోషనల్ అయ్యారు.
‘ఈ వేదికపైకి వచ్చి మాట్లాడడానికి నాకు 15 ఏళ్లు పట్టింది. ప్రతి ఏడాది ఇక్కడి తెలుగు వారి గురించి వింటూనే ఉంటాను. నా మొదటి చిత్రం ఏ మాయ చేసావె’ నుంచి నన్ను మీరు ఆదరిస్తున్నారు. ఇన్నాళ్లకు మీకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం వచ్చింది. మొదటి నుంచి మీరు నాకు ప్రేమను మాత్రమే ఇస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..మీరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు నా కెరీర్ పరంగా ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిర్మాతగా శుభం సినిమా తీస్తే.. నార్త్ అమెరికాకు చెందిన తెలుగు వాళ్లు ఎంతో ఆదరించారు.
నేను ఎక్కడికి వెళ్లినా.. ఏ పరిశ్రమలో పని చేసినా.. తెలుగు ప్రేక్షకులు నన్ను గర్వపడతారా లేదా? అనేదే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకొక ఐడెంటీటీ, కుటుంబాన్ని ఇచ్చారు. నా ఓబేబీ సినిమా ఇక్కడ ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించిదని చెబితే నమ్మలేకపోయాను. ఇదంతా మీవల్లే సాధ్యమైంది. మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ నా హృదయంలో మాత్రం మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది’ అంటూ సమంత భావోద్వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Actress #Samantha got emotional during her speech at TANA Conference 2025. pic.twitter.com/LV6SBVZZ5g
— Whynot Cinemas (@whynotcinemass_) July 6, 2025