
ఓ వైపు కళారంగంలో తళుక్కుమంటూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు నేటి సినీ తారలు. నటనలో అవకాశాలను సద్వినియోగం చేయడంలోనే కాదు తమలో ఉన్న సాధికారిత శక్తిని కూడా నిరూపిస్తున్నారు. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మికా మందన్నా నుంచి నయనతార, సమంత, తమన్నా... ఇలా ప్రతీ నటీమణి తమ జీవితాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. సినిమా స్టార్స్‌గా కోట్లలో పారితోషికం తీసుకుంటున్న ఈ తారలు ఆ డబ్బుని రెట్టింపు చేసే పని మీద ఉన్నారు. వ్యా పారంలోనూ కోట్లు సం పాదించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ‘షో (సినిమా) బిజినెస్’లో రాణిస్తూ వేరే ఏయే ‘బిజినెస్’లోకి ఈ స్టార్స్ ఎంటరయ్యారో తెలుసుకుందాం.
తండ్రి బాటలో...
మిల్కీ బ్యూటీగా నార్త్, సౌత్‌లో బోలెడంత క్రేజ్ సం పాదించుకున్నారు తమన్నా. హీరోయిన్ అయి, దాదాపు 20 ఏళ్లు కావొస్తున్నా అదే స్పీడుతో దూసుకెళుతున్నారు. ఇక ఇటీవల ఐటెమ్ సాంగ్స్‌తోనూ అలరిస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్ నగల వ్యా పారాన్ని ఆరంభించారు. ఈ ఆభరణాలను తనే డిజైన్ చేస్తున్నారు కూడా. ఇంతకీ తమన్నాకి జ్యుయెలరీ బిజినెస్ ఎందుకు చేయాలనిపించిదంటే... ఆమె తండ్రి వల్లే. తమన్నా తండ్రికి నగల వ్యా పారం ఉంది. దాంతో కుమార్తెకి కూడా ఆ వ్యా పారంపై ఆసక్తి కలిగింది. ఒకవైపు నటన... మరోవైపు జ్యుయెలరీ బిజినెస్‌తో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీ.
మ్యూజిక్‌పై మమకారంతో..
బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌హాసన్ తనయగా శ్రుతీహాసన్ కూడా మల్టీ టాలెంటెడ్. తనలో మంచి నటి, గాయని, సంగీతదర్శకురాలు... ఇలా ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. అయితే హీరోయిన్‌గా బిజీగా ఉంటున్న శ్రుతీహాసన్ తనకెంతో నచ్చిన మ్యూజిక్‌పై కూడా దృష్టి సారించాలనుకున్నారు. అందుకే ‘ఇసిడ్రో’ అనే నిర్మాణ సంస్థను ఆరంభించారామె. ఈ సంస్థ లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలు, వీడియో రికార్డింగ్‌లను ఈ రూపొందిస్తుంటుంది.
క్లాతింగ్ బ్రాండ్... ప్రోడక్షన్
నటనలో భేష్ అనిపించుకున్న సమంత తన స్టైలిష్ లుక్స్‌కు కూడా చాలా పాపులర్. సినిమాల్లోనే కాదు... విడిగా కూడా సమంత రకరకాల డ్రెస్ డిజైన్స్ ట్రై చేస్తుంటారు. ఇప్పటికే ‘సాకీ’ పేరుతో సమంతకు క్లాతింగ్ బ్రాండ్ ఉంది. 2020లో ఈ బ్రాండ్‌ని ఆరంభించారామె. అలాగే ఏ సినిమా ఫీల్డ్ అయితే తనకు నటిగా మంచి జీవితాన్ని ఇచ్చిందో అదే సినిమా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుని, ‘ట్రా లా లా’ బేనర్‌ని ఆరంభించారు. ఈ బేనర్‌లో తొలి ప్రయత్నంగా ‘శుభం’ చిత్రాన్ని నిర్మించారు సమంత. అలాగే ఇదే బేనర్‌లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించారు.
నయన... నాలుగైదు వ్యా పారాలు
నటనలో లేడీ సూపర్‌స్టార్ అని పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ‘ది లిప్ బామ్ కంపెనీ’ని స్థాపించారు. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ‘రౌడీ పిక్చర్స్‘ అనే నిర్మాణ సంస్థలో పాలు పంచుకున్నారు. చెన్నైలో ‘ఛాయ్‌వాలే’ అనే స్థానిక పానీయాల బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టి, రెస్టారెంట్ వ్యా పారంలో కూడా రాణిస్తున్నారు. ఇటీవల ‘9 స్కిన్’ అనే చర్మ సంరక్షణ బ్రాండ్‌నూ ప్రారంభించారామె. మొత్తానికి ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్క వ్యా పారంలో కాదు... నాలుగైదు వ్యా పారాల్లో పెట్టుబడి పెట్టి, దూసుకెళుతున్నారు.
ఫ్యాషన్ రంగలోకి నేషనల్ క్రష్
‘నేషనల్ క్రష్’గా పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న రష్మికా మందన్నా తన కొత్త వ్యా పారాన్ని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన తల్లితో జరిపిన సంభాషణ వీడియోను పంచుకున్నారామె. తన తల్లితో మాట్లాడుతూ– ‘అమ్మా... ఈ రోజు చాలా చాలా ముఖ్యమైన షూటింగ్ చేయబోతున్నాను. మీరు చెప్పినట్టుగా ఈ వ్యా పారాన్ని ప్రారంభించబోతున్నాను’ అని ఆమె తన తల్లితో పేర్కొన్నారు. రష్మిక తల్లి ‘దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు’ అని కుమార్తెను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఇంతకీ రష్మిక ఏ బిజినెస్ చేయనున్నారంటే.... తన సొంత బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు.
శ్రద్ధగా వ్యా పారంలోకి...
కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ బిజీని ఎంజాయ్ చేసి, కాస్త అవకాశాలు తగ్గగానే డీలా పడి పోతుంటారు కొందరు తారలు. కానీ శ్రద్ధా దాస్ అలా కాదు. ఒకప్పుడు మంచి కెరీర్‌ని చూసిన ఈ బ్యూటీ... ఇప్పుడు నటిగా అంత బిజీగా లేక పోయినా నగల వ్యా పారంతో జోష్‌గా ఉన్నారు. ‘పల్మోనాస్’ అనే డెమీ ఫైన్ జ్యుయెలరీ బ్రాండ్‌ని ఆరంభించారు. పల్మోనాస్‌కి ఆమె ఒక ఫౌండర్. ఈ నగల వ్యా పారాన్ని కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు శ్రద్ధా దాస్.
ఇలా మరికొందరు తారలు ఇతర వ్యా పారాల్లో పెట్టుబడి పెట్టి, ‘బిజినెస్ ఉమన్’గానూ రాణిస్తున్నారు. ప్రతిభ, వ్యా పార చతురతతో అటు కెరీర్ ఇటు వ్యా పార రంగంలోనూ విజయవంతంగా విస్తరిస్తున్నారు ఈ కథానాయికలు. ఈ స్టార్స్ నవతరానికి సవాల్‌తో కూడిన ఆలోచననూ అందిస్తున్నారు.