హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఫోకస్ అంతా సినిమాల కన్నా బిజినెస్ వైపే ఎక్కువగా ఉంది. మొన్నటికి మొన్న కొత్త పర్‌ఫ్యూమ్ లాంచ్ చేసిన సామ్ ఇప్పుడు మరో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ 'ట్రూలీ స్మా' అనే క్లాతింగ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఈ బ్రాండ్‌కు సామ్ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు హీరోయిన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బిజినెస్ ఉమెన్
సమంత యాక్టింగ్‌కే కాదు, లుక్స్‌కు కూడా చాలా మంది ఫిదా అవుతుంటారు. ఎప్పుడూ కొత్త డిజైనరీ డ్రెసెస్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పటికే సామ్.. 'సాకీ' పేరుతో బట్టల బిజినెస్ చేస్తోంది. 2020లో ఈ వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ట్రూలీ స్మా అనే క్లాతింగ్ బ్రాండ్‌లో భాగమైంది. ఇవే కాకుండా తను 'ట్రలాలా' అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్‌లో 'శుభం' అనే సినిమాతో మంచి బోణీ కొట్టింది. ఇదే బ్యానర్‌లో తను హీరోయిన్‌గా మా ఇంటి బంగారం మూవీ చేస్తోంది. ఈ మధ్యే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.
చదవండి: 'శివ' చైల్డ్ ఆర్టిస్ట్‌కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ


