'శివ' చైల్డ్‌ ఆర్టిస్ట్‌కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ | Ram Gopal Varma’s Shiva Re-release: Child Artist Sushma Now AI Researcher in USA | Sakshi
Sakshi News home page

శివ సినిమా చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. ఇప్పుడిలా.. ఫోటో షేర్‌ చేసిన ఆర్జీవీ

Nov 12 2025 11:50 AM | Updated on Nov 12 2025 12:18 PM

Ram Gopal Varma Shares Siva Movie Child Artist Details

తెలుగులో ఓ కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Siva Movie). ఫస్ట్‌ మూవీతోనే రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ఇండస్ట్రీ హిట్‌ కొట్టడంతోపాటు స్టార్‌ హీరోగా నాగార్జున దశ తిరిగిపోయింది. అమల హీరోయిన్‌గా జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం 1989 అక్టోబర్‌ 5న విడుదలైంది. 36 ఏళ్ల తర్వాత శివ నవంబర్‌ 14న రీరిలీజ్‌ అవుతోంది.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఇప్పుడేం చేస్తోందంటే?
ఈ సందర్భంగా ఆర్జీవీ సోషల్‌ మీడియాలో ఓ అమ్మాయి ఫోటో పోస్ట్‌ చేశాడు. ఆమె మరెవరో కాదు, శివ మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌. శివ సినిమాలో భవానీ గ్యాంగ్‌.. నాగార్జునను చేజ్‌ చేస్తుంటుంది. నాగ్‌ ఓ చిన్నపాపను ముందు కూర్చోబెట్టుకుని వేగంగా సైకిల్‌ తొక్కుతుంటాడు. ఇంతలో యాక్సిడెంట్‌ అయి ఇద్దరూ కిందపడిపోతారు. అప్పుడు పాపను ఎత్తుకుని నాగ్‌.. గూండాలతో ఫైటింగ్‌ చేస్తుంటాడు. ఇదీ ఆ సీన్‌.

క్షమించండి
ఆ సీన్‌లో ఉన్న పాప పేరు సుష్మ. ఆమె ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందని తెలియజేస్తూ వర్మ ఓ పోస్ట్‌ పెట్టాడు. సైకిల్‌ చేజ్‌ సీన్‌లో ఉన్న చిన్నారే ఈ సుష్మ. ప్రస్తుతం అమెరికాలో ఏఐ, కాగ్నిటివ్‌ సైన్స్‌లో రీసెర్చ్‌ చేస్తోంది అని పేర్కొన్నాడు. మరో ట్వీట్‌లో.. సుష్మ, నువ్వు చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. అప్పుడు ఆ సీన్‌ ఎంత ప్రమాదకరమనేది నాకు అర్థం కాలేదు. దర్శకుడిగా నా స్వార్థం మాత్రమే చూసుకుని ఇలాంటి రిస్కీ షాట్స్‌ తీశాను. అందుకు నన్ను క్షమించు అంటూ 36 ఏళ్ల తర్వాత ఆమెకు సారీ చెప్పాడు.

Being part of Shiva is a cherished memory. That cycle chase adventure influenced me and prepared me for later intellectual endeavors and adventures. I felt safe and excited to be part of something magical. Shiva remains a souvenir. 🙏https://t.co/bzdtBwMCVP

— Sushma Anand Akoju. She/Her (@symbolicsushi) November 12, 2025

చదవండి: PR కోసం రూ.16 లక్షలు.. తెలుగులోనూ ఇదే జరుగుతోందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement