
గత కొన్నేళ్లలో తీసుకుంటే సినిమాలు చాలావరకు తగ్గించేసిన సమంత.. ఓటీటీలపై పూర్తిగా దృష్టి పెట్టింది. పలు వెబ్ సిరీసుల్లో నటించింది. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ప్రైమ్ బ్రాండ్ క్యాంపెన్‌లో పాల్గొంది. తన ప్రయాణం అంతా రకరకాల భావోద్వేగాలతో నిండిందని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి:కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన రష్మిక)
సమంత మాట్లాడుతూ.. ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ హనీ బన్నీ తదితర సిరీసుల్లో తను పోషించిన పాత్రలని గుర్తు చేసుకుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులు అనుభూతి చెందేలా, ఆ పాత్ర తాలూకు భావొద్వేగాలతో మమేకమయ్యేలా ఉంటాయని అందుకే అవి అంతగా వారికి చేరువ అయ్యాయని చెప్పింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సామ్ సహనటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలుచేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌లో తను పోషించిన పాత్రలోని భిన్న కోణాలు తనపై ఎంత ప్రభావం చూపించాయో మనోజ్ బాజ్ పాయ్ గుర్తుచేసుకున్నాడు.
(ఇదీ చదవండి: కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్)