
చాలామంది చేతిలో డబ్బులున్నాయా కదా అని ఖర్చు పెట్టేస్తుంటారు. అయితే చేతిలో పైసా ఉన్నప్పుడు దాన్ని ఆదా చేయాలి, లేదంటే ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టుకోవాలి అనేది ఇప్పటి ట్రెండ్. దీన్ని చాలామంది హీరోయిన్లు కూడా పాటించేస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లు మొదలుపెట్టేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నయనతార, సమంత లాంటి స్టార్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రష్మిక కూడా ఆ రూట్‌లోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)
గత రెండు మూడు రోజుల నుంచి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని ఊరిస్తూ వచ్చిన రష్మిక.. ఇప్పుడు ఆ విషయమేంటో బయటపెట్టింది. 'డియర్ డైరీ' పేరుతో ఓ ఫెర్ఫ్యూమ్ బ్రాండ్‌ని లాంచ్ చేసింది. ఇది ఓ బ్రాండో లేదంటే ఫెర్ఫ్యూమో కాదని.. ఇది తనలో ఓ భాగమని చెప్పుకొచ్చింది. ఈ బిజినెస్ విషయంలో అందరి సపోర్ట్ కావాలని చెప్పుకొచ్చింది. ఈ ఫెర్ఫ్యూమ్ ధరల విషయానికొస్తే రూ.1600, రూ.2600 రేంజులో ఉన్నాయి.
యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర.. ఇలా వరస బ్లాక్‌బస్టర్స్ కొట్టిన రష్మిక.. హీరోయిన్‌గా సూపర్ ఫామ్‌లో ఉంది. మరి బిజినెస్ ఉమన్‌గా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి? మరోవైపు హీరో విజయ్ దేవరకొండతో ఈమె రిలేషన్‌లో ఉన్నట్లు చాన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. అందుకు తగ్గట్లే అప్పుడప్పుడు ఫొటోలు బయటకొస్తుంటాయి. మరి వీళ్లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా? అని అభిమానులు కూడా కాస్త ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు. మరి ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాలి?
(ఇదీ చదవండి: చరణ్ 'పెద్ది'.. ఈ రేంజులో మారిపోయాడేంటి?)