
చాన్నాళ్ల తర్వాత సమంత ఓ తెలుగు సినిమా చేసింది. అదే 'శుభం'. దీనికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ చిన్న పాత్రలో కూడా నటించింది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి.
శుభం సినిమాకు తొలిరోజు రూ.1.5 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చాయని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఈ మూవీ ప్రచారంలో పాల్గొన్న సామ్.. చాలా కష్టపడింది. కానీ ఈమె ప్రభావం బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం పనిచేయలేదా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్)
ఎందుకంటే 'శుభం'తో పాటు శ్రీ విష్ణు '#సింగిల్' (రూ.4.15 కోట్లు), చిరంజీవి క్లాసిక్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' (రూ.1.75 కోట్లు) థియేటర్లలోకి వచ్చాయి. కానీ సమంత సినిమాకు మిగతా వాటి వల్ల కాస్త మైనస్ అయింది. వసూళ్లలో దెబ్బ పడ్డట్లు అనిపిస్తుంది. మరి వీకెండ్ అయ్యేసరికి సమంత మూవీ లాభాల్లోకి వెళ్తుందా లేదా అనేది చూడాలి?
శుభం విషయానికొస్తే.. కేబుల్ ఆపరేటర్ శ్రీను (హర్షిత్).. శ్రీవల్లి (శ్రియ)ని పెళ్లిచేసుకుంటాడు. అయితే శ్రీవల్లి ఫస్ట్ నైట్ ని కూడా పక్కనబెట్టి ఓ సీరియల్ కి అతుక్కుపోతుంది. అడ్డొచ్చిన భర్తకు వార్నింగ్ ఇస్తుంది. తన స్నేహితులిద్దరిదీ ఇదే బాధ. వీళ్లకే కాదు ఆ ఊరిలో అందరూ రాత్రి 9 అయితే వింతగా ప్రవర్తిస్తుంటారు? దీనికి కారణమేంటి? ఈ మొత్తం ఎపిసోడ్ లో సమంత పాత్ర ఏంటి? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)