
బ్లాక్‌బస్టర్ సినిమా ‘రంగస్థలం’ తర్వాత హీరో రామ్‌చరణ్, హీరోయిన్ సమంత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ... వీరిద్దరూ ఈసారి హీరో, హీరోయిన్లుగా నటించడంలేదట. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ పలువురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రీలీల వంటి హీరోయిన్ల పేర్లు వినిపించగా, తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ (2021) సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావ...’ స్పెషల్ సాంగ్ బాగాపాపులర్ అయిన సంగతి తెలిసిందే.
ఈపాట తర్వాత సమంత మరో స్పెషల్ సాంగ్ చేయలేదు. మరి... రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేకపాటకు సమంత ‘ఊ’ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్