అదే మా ‘ట్రాలాలా’ లక్ష్యం: సమంత | Samantha Interesting Comments About Subham Movie At Success Meet, Deets Inside | Sakshi
Sakshi News home page

Actress Samantha: అదే మా ‘ట్రాలాలా’ లక్ష్యం

May 17 2025 10:46 AM | Updated on May 17 2025 11:37 AM

Samantha Talk About Subham Movie At Success Meet

‘‘శుభం’ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరిలో నవ్వులు, సంతోషం కనిపిస్తున్నాయి. ఇదే అసలైన విజయం. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు’’ అని హీరోయిన్, నిర్మాత సమంత చె΄్పారు. హర్షిత్‌ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియా కొంతం, చరణ్‌ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సమంత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. 

శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో సమంత మాట్లాడుతూ– ‘‘శుభం’ చూస్తే నా వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. మమ్మల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఓ మూవీని మా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన రోజులన్నీ మళ్లీ గుర్తుకొచ్చాయి. ‘శుభం’తో అందర్నీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. ఇలాంటి మంచి చిత్రాలను తీసి కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తు చేస్తూనే ఉంటాం... అదే మా ట్రాలాలా లక్ష్యం.

 సినిమా రిలీజ్‌కు ముందు మూడు రోజులు మా టీమ్‌లోని ఏ ఒక్కరూ నిద్ర΄ోలేదు. ఇప్పుడు వస్తున్న ప్రేమ, అభిమానం, ప్రశంసలన్నింటికీ వాళ్లే కారణం. నాకు సపోర్ట్‌గా నిలిచిన మైత్రి శశి, సురేష్‌బాబుగార్లకు థ్యాంక్స్‌. అభిమానులే నా ప్రపంచం. ‘శుభం’ని ముందుకు తీసుకెళ్తున్న ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. 

ప్రవీణ్‌ కండ్రేగుల మాట్లాడుతూ– ‘‘సమంతగారు లేక΄ోతే ‘శుభం’ని ఎవరు చూస్తారు? ఆమె వల్లే ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి’’ అన్నారు. నటీనటులు శ్రియా కొంతం, శ్రావణి, షాలినీ, వంశీధర్, హర్షిత్‌ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్, రచయిత వసంత్, సహ నిర్మాత హిమాంక్, ‘మైత్రీ’ మూవీస్‌ శశి, ్ర΄÷డక్షన్‌ డిజైనర్‌ రామ్, క్యాస్ట్యూమ్‌ డిజైనర్‌ పూజిత, రాగ్‌ మయూర్‌ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement