టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ డైరక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వీరి వివాహా వేడుక జరిగింది. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు.
తాజాగా సమంత సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి ఈ పండుగను జరుపుకుంది. సంక్రాంతి వైబ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సామ్ జంటకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ జంట సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.


