
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి.

దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది.

యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు. అందుకే పలువురు రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు క్రికెటర్లు, సినీతారలు, యోగావైపు మొగ్గు చూపుతున్నారు

ఫిట్‌గా హెల్దీగా ఉండేందుకు అనేక మంది సినీ సెలబ్రిటీలు యోగాకు జైకొడుతున్నారు.

క్లిష్టమైన ఆసనాలను కూడా అలవోకగా సాధన చేస్తూ, నటీమణులు సన్నజాజితీగల్లా మెరుస్తున్నారు.





