
సౌత్ ఇండియా నటి సమంతతో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డేటింగ్‌లో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ క్లారిటీ ఇవ్వకపోడం తరుచుగా కలిసి కెమెరా కంటపడుతున్నడంతో నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా రాజ్ కుటుంబంతో పాటుగా సమంత(Samantha) దీపావళి సెలబ్రేట్ చేసకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో వైరల్ అవుతున్నాయి. ఈ డేటింగ్ రూమర్స్ విషయంలో ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా సమంత పోస్ట్ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 నుంచి రాజ్ నిడిమోరుతో సమంతకు పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.ఈ దీపావళి సందర్బంగా పలు ఫోటోలతో పాటు నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయిందని సమంత ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఆపై ఆమె షేర్ చేసిన ఫోటోలలో రాజ్ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ, అతని సతీమణి శ్యామాలి లేదు. దీంతో ఈ రూమర్స్‌కు మరింత బలాన్ని ఇచ్చేసినట్లు అయింది. శ్యామాలి కూడా రాజ్‌తో దూరంగా ఉన్నారని సమాచారం.
అయితే, సమంత- రాజ్ రిలేషన్ గురించి ఆమె అప్పుడప్పుడు పరోక్షంగా పోస్టులు చేసేవారు. శ్యామాలి చివరిసారి 2023లో రాజ్‌తో దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. ఆ సమయం తర్వాత వారిద్దరు కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు. రాజ్‌తో ఆమె విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆపై సమంత- రాజ్‌లు కూడా డేటింగ్ అంశంపై స్పందించలేదు.