ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత (samantha) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఏ ఈవెంట్‌కెళ్లినా అతను కూడా వాలిపోతున్నాడు. గత కొన్ని నెలలుగా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటిపై ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల సమంత కొత్త సినిమా ప్రారంభోత్సంలోనూ అతను కనిపించాడు.
తాజాగా మరోసారి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు. అయితే ఎప్పటిలాగా కంటే ఈ సారి మరింత సన్నిహితంగా మెలిగారు. ఈ ఫోటోల్లో రాజ్ నిడిమోరును హగ్ చేసుకోవడం పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో అందరూ ఊహించినట్లుగానే రాజ్‌తో సామ్ డేటింగ్ చేస్తోందని కన్‌ఫామ్ చేసిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. రాజ్ నిడిమోరు, సామ్ ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీసుల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత సామ్, రాజ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఈ ఏడాది సమంత నిర్మించిన శుభం మూవీకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ప్రస్తుతం సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీకి కూడా పనిచేస్తున్నారు.


