
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. కొత్తవారితో తాను నిర్మించిన శుభం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది సామ్. తన సినిమాకు హిట్ టాక్ రావడంతో సెలబ్రేషన్స్ చేసుకుంది. శుభం మూవీ టీమ్‌తో కలిసి సక్సెస్ వేడుకలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
అయితే ఈవెంట్‌లో పాల్గొన్న సమంత అసిస్టెంట్ ఆర్యన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆర్యన్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన సమంత వెంటనే అతన్ని ఓదార్చింది. హృదయానికి హత్తుకుని మరి అసిస్టెంట్‌ను సముదాయించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది చూసిన పలువురు నెటిజన్స్ సమంత గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఈ మూవీ తర్వాత సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె ఫోటోలు షేర్ చేయడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఈ విషయంపై రాజ్ నిడిమోరు భార్య కూడా స్పందించింది.
Entha love unte ❤️ oka team member ki edupu ostadi 🙌 @Samanthaprabhu2 HEARTFUL MOMENT WITH HER TEAM 🥹❤️🔥👏#shubham #SamanthaRuthPrabhu#Samantha pic.twitter.com/UE58hUBJ4c
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) May 16, 2025