
గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. కానీ గత కొన్నిరోజుల క్రితం సమంత పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇప్పుడదే దర్శకుడితో మళ్లీ కనిపించడం, ఆ ఫొటోలని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
విడాకుల తర్వాత సమంత.. తాను మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాననే విషయాన్ని బయటపెట్టింది. మధ్యలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసింది. ఇది తప్పితే మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ వెబ్ సిరీసులో నటించిందంతే.
(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక)
సరే అసలు విషయానికొస్తే.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రెండో సీజన్ లో సమంత నటించింది. ఈ సిరీస్ చేసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ తో రీసెంట్ టైంలో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వెళ్లొచ్చారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించాయి. సామ్ నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇది రూమర్ గానే మిగిలిపోయింది.
తాజాగా న్యూ బిగినింగ్స్ అని ఓ పోస్ పెట్టింది. ఇందులో తన త్రలాలా నిర్మాణ సంస్థ గురించి, తాను నిర్మించిన శుభం మూవీ గురించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులోనూ రాజ్ తో సమంత దిగిన కొన్ని ఫొటోలు కనిపించాయి. దీంతో బయట వినిపిస్తున్న రూమర్స్ ని ఏమైనా నిజం చేస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?)