
కొన్నిసార్లు చిన్న సినిమానే కదా ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ అదే భారీ దెబ్బ కొట్టొచ్చు. తమిళ ప్రేక్షకుల్ని ప్రస్తుతం ఎంటర్ టైన్ చేస్తున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ'ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజ్ అనేసరికి చాలామంది.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా అనుకున్నారు. కానీ ఇప్పుడదే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది.
చాలా తక్కువ బడ్జెట్, సింపుల్ కథతో తీసిన ఈ సినిమా మే 01న రిలీజైతే ఇప్పటివరకు రూ.20 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పోటీలో ఉన్న రెట్రో కంటే దీన్ని చూసేందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
అసలు విషయానికొస్తే ఈ సినిమాని త్వరలో తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది కానీ అది జరిగే పనిలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది తమిళ ఫ్లేవర్ తో తెరకెక్కిన కథ. దీన్ని తెలుగులో ఆదరిస్తారా అంటే సందేహమే. అదే టైంలో ఓటీటీలో రావడానికి నాలుగు వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట.
ఈ లెక్కన చూసుకుంటే 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా ఓటీటీలోకి మే 31న వచ్చే సూచనలు గట్టిగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అప్పుడే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో సిమ్రాన్ తప్పితే మనకు తెలిసిన ముఖం లేదు.
(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక)
