
నటి సమంత రూటే వేరు. తనకు నచ్చినట్లు ప్రవర్తించే నటీమణుల్లో ఈమె ముందుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ సోషల్‌మీడియాతో తన అభిమానులకు ఆమె టచ్‌లో ఉంటారు. తనకు నచ్చిన ప్రతి విషయాన్ని ఆమె పంచుకుంటారు. విడాకులు, మయోసైటిస్ ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి కూడా అందులో వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా తాను ఎవరూ..? ఎంత పెద్ద సెలబ్రిటీ..? జీవితంలో ఏం సాధించానో తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు.
విడాకులు పొందిన సమంత ఆ తరువాత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురై దాని నుంచి బయట పడటానికి పెద్ద పోరాటమే చేశారు. అలా చాలా కాలం నటనకు దూరం అయిన ఈమె మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అలా వెబ్ సిరీస్‌లో నటించిన సమంత ఇటీవల నిర్మాతగానూ అవతారమెత్తి శుభం అనే చిత్రాన్ని నిర్మించారు కూడా. ఇలా నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటున్న సమంత తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో టీట్ చేశారు. అందులో తన చేతిలో ఎప్పుడూ సెల్‌ఫోన్ ఉంటుందన్నారు. దీంతో సడన్‌గా తనకొక ఆలోచన వచ్చిందనీ, దీంతో వెంటనే తన సెల్‌ఫోన్‌ను మూడు రోజుల పాటు స్విచ్చ్ ఆఫ్ చేసినట్లు చెప్పారు. ఆ మూడు రోజులు ఎవరితోనూ మాట్లాడలేదనీ, ఎవరినీ చూడలేదనీ, పుస్తకాలు చదవడం, రాయడం వంటివేవీ చేయలేదన్నారు. ఇంకా చెప్పాలంటే ఏ పని చేయలేదన్నారు.
అలా మూడు రోజులు మెదడుకు పూర్తిగా విశ్రాంతినిచ్చినట్లు చెప్పారు. ఆ అనుభవం చాలా కొత్తగా ఉందన్నారు. తన ఈగోలో చాలా భాగం తన సెల్‌ఫోన్‌తోనే అన్నది అప్పడు అర్థం అయ్యిందన్నారు. తాను ఎవరూ? ఎంత సెలబ్రిటీనీ? ఏం సాధించాను? అన్న విషయాలు తన సెల్‌ఫోన్‌నే చెబుతుందన్నారు. అది లేని రోజున తాను ఒక సాధారణ జీవినని అనే భావన కలిగిందన్నారు. పుట్టుకకు గిట్టుటకు మధ్య కాలంలో సెల్‌ఫోన్ మనకు ప్రకృతికి చెందిన విషయాలను కనుమరుగు చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన పెద్దలకు, ఆరోగ్యానికి సెల్‌ఫోన్ ఎంత ఆటంకంగా మారిందన్నది అవగతం చేసుకున్నానని నటి సమంత అన్నారు. ఈమె చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.