సమంత, గవిరెడ్డి శ్రీను, బ్రిగిడా సాగా
‘శుభం’ మూవీ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా, బ్రిగిడా సాగా హీరోయిన్‌గా ‘చీన్ టపాక్ డుం డుం’ అనే మూవీ షురూ అయింది. వై.ఎన్. లోహిత్ దర్శకత్వంలో విలేజ్ టాకీస్ పతాకంపై శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. దర్శకుడు మల్లిడి వశిష్ఠ కెమెరా స్విచ్చాన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి నటి–నిర్మాత సమంత క్లాప్ ఇచ్చారు.
తొలి షాట్‌కి దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. దర్శకురాలు నందినీ రెడ్డి, రచయిత బీవీఎస్ రవి, గౌతమి కలిసి.. స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘ప్రేక్షకులను అలరించే పూర్తి వినోదాత్మక చిత్రం ‘చీన్ టపాక్ డుం డుం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: పీఆర్.


