ఓటీటీలో 'సమంత' సినిమా.. ట్రైలర్‌ విడుదల | Samantha Subham Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'సమంత' సినిమా.. ట్రైలర్‌ విడుదల

Jun 8 2025 1:30 PM | Updated on Jun 8 2025 1:47 PM

Samantha Subham Movie OTT Streaming Date Locked

టాలీవుడ్‌ నటి స‌మంత నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా 'శుభం' ఓటీటీలోకి రానుంది.  ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణంలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. తన తొలి ప్రయత్నంలోనే  కొత్తతరం నటులతో తెరకెక్కించడమే కాకుండా ఆమె ఇందులో మాయ అనే అతిథి పాత్రలోనూ మెప్పించారు. మే 9న విడుదలైన శుభం మూవీని ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పెరి, వంశీధర్‌ గౌడ్‌, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి తదితరులు నటించారు. 

జియో హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 13 నుంచి శుభం చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. 

Advertisement
 
Advertisement
Advertisement