
అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ను కవర్ చేస్తూ వచ్చిన చిత్రం మనం. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత హీరోయిన్గా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
తాజాగా అభిమానులకు సామ్-నాగ్ జంటను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని జపాన్లో విడుదల చేయనున్నట్లు నాగచైతన్య ట్వీట్ చేశారు. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రం మనం.. ఈ సినిమా జపాన్ ప్రజలకు చేరువవుతుండటం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. మనం ఆగస్టు 8న థియేటర్లలో విడుదల కానుందని చైతూ వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్‌కు మరోసారి సామ్- చైతన్యను బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం దక్కనుంది.
అక్కినేని ఫ్యామిలీ నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మార్మోగిపోతూనే ఉంటాయి.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన సమంత- నాగ చైతన్య రియల్ లైఫ్‌లోనూ పెళ్లి పీటలెక్కారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. గతేడాది డిసెంబర్లో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. ప్రస్తుతం సమంత ఇప్పటి వరకు సింగిల్గానే ఉంటోంది. అయితే బాలీవుడ్ డైరెక్టర్తో రిలేషన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Thrilled that #Manam a film very close to my heart is making its way to the people of Japan . The film will be releasing on the 8th August in theaters . #Anrliveson #50YearsOfAnnapurnastudios pic.twitter.com/3x6u3XlRVV
— chaitanya akkineni (@chay_akkineni) August 3, 2025