
కమెడియన్ రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఇంట సంతోషాల మూట అడుగుపెట్టి ఏడాదవుతోంది. వీరిద్దరూ 2023లో పెళ్లి చేసుకోగా 2014లో కూతురు పుట్టింది. తమ ఇంట్లో సంబరాన్ని, సందడిని తీసుకొచ్చిన గారాలమూటకు ఖ్యాతిక అని నామకరణం చేశారు. ఇటీవలే తన అన్నప్రాసన కూడా జరిగింది. తాజాగా తన మొదటి పుట్టినరోజు ఘనంగా సెలబ్రేట్ చేశారు. బంధుమిత్రుల సమక్షంలో ఈ బర్త్‌డే వేడుకలు జరిగాయి.

హ్యాపీ బర్త్‌డే చిట్టితల్లి
ఈ సెలబ్రేషన్స్‌కు బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్ కూడా వెళ్లింది. హ్యాపీ బర్త్‌డే చిట్టి తల్లి అంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జోర్దార్ సుజాత సైతం కూతురి గురించి స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఆగస్టు 1.. మా జీవితంలోకి సాక్షాత్తూ అమ్మవారే వచ్చినరోజు. మా ఇంట వెలుగులు నింపిన రోజు.. అమ్మానాన్నలుగా మేము వరం పొందిన రోజు.. నా బంగారుతల్లి పుట్టినరోజు. నా ఖ్యాతికమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న రోజు.. అప్పుడే సంవత్సరం కావొస్తుంది.
కమెడియన్‌గా..
పుట్టినరోజు శుభాకాంక్షలు ఖ్యాతికమ్మా.. మా అదృష్ట దేవతను అద్భుతంగా చూసుకునేలా మమ్మల్ని ఆశీర్వదించండి అని రాసుకొచ్చింది. రాకేశ్.. జబర్దస్త్ షోతో కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు. కేసీఆర్ సినిమాలో నటించడమే కాకుండా దానికి నిర్మాతగా వ్యవహరించాడు. టీవీలో యాంకర్‌గా పని చేసిన సుజాత జోర్దార్ షోతో పాపులారిటీ సంపాదించింది. తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.
చదవండి: స్టార్స్ రీయూనియన్.. జల్సాకు బదులు సేవ చేయొచ్చుగా!