హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram Movie). ఇందులో సామ్ గృహిణిగా యాక్ట్ చేస్తోంది. సమంత బర్త్‌డే సందర్భంగా 2024లోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. కానీ, షూటింగ్ ప్రారంభించలేదు. అయితే ఈ వారంలోనే సినిమా చిత్రీకరణ షురూ అయిందని ఫిలిం నగర్ సమాచారం. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో సమంత పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఈ సినిమాలో నటించడంతో పాటు సమంత తన నిర్మాణ సంస్థ ట్రలాలా పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు.
సినిమా
సమంత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించింది. ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత హీరోయిన్‌గా మరే సినిమా చేయలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించి శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.


